Saturday, 8 June 2013

Kaaleswaram Yaatraa Viseshaalu....

కాలేశ్వరం యాత్రా విశేషాలు :

ఈ మధ్యనే సరస్వతి పుష్కరాలు కోసం కాళేశ్వరం కు వెల్లాము. హైదరాబాద్ నుంచి మొదట వెళ్ళేప్పుడు కరీంనగరం మీదుగా వెళ్ళాం . ఈ రూట్ లో 300 KMs దూరం లో వుంది . ఈ రూట్ అంత బాగా లెదు.

రెండవ రూట్ , వరంగల్ మీదుగా వెళ్ళొచ్చు . ఈ రూట్ బాగుంది . దూరం కూడా 260 KMs.

ఇక్కడ వసతి సదుపాయాలూ ఇంకా అభివృద్ధి అవ్వాల్సి వున్ది.  TTD  వాళ్ళ సత్రం వుంది , కాని కొంచం వసతి విషయం లో రాజీ పడాల్సి వుంటుంది.

భోజన సదుపాయం కూడా అంతంత మాత్రం గానే సదుపాయాలూ వున్నయి.

ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు విషయానికి వస్తే, మొదట గా త్రివేణి సంగమం గా ప్రసిద్ధి పొందిన గోదావరి , ప్రాణహిత మరియు సరస్వతి నదీ సంగమం చూడాలి. అక్కడ సదుపాయాల విషయాని కి వస్తే , ఆడవారి కి కొంచెం కష్టం గా వున్ది. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యలి.

ఆ తర్వాతా, ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం టెంపుల్ చూడాలి . టెంపుల్ చాలా విశాలంగా , ఎంతో సుందరంగా మరియు ప్రకృతి అందాలా నడుమ నెలకొని వున్ది. కాకపొతే , శుభ్రత విషయం లో చాలా చెయ్యాల్సి వున్ది.

ఒకే పానపట్టం మీద రెండు లింగాలు ఇక్కడి విశేషం గా చెబుతారు. ఒక లింగం కాలేశ్వరుదు మరియొక లింగం ముక్తెస్వర లింగం గా కొలుస్తారు.

ఇక్కడ స్వామి వారిని పూజిస్తే కాశి లో పుజించినంత పుణ్యం కలుగుతున్ది.

మరిన్ని విశేషాలు, next ఎపిసోడ్ లో మీకు తెలుపుతాను. 

No comments:

Post a Comment